బాహుబలి కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువ : సల్మాన్ | Salman Khan on Baahubali 2 Collections | Sakshi
Sakshi News home page

బాహుబలి కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువ : సల్మాన్

May 27 2017 2:46 PM | Updated on Sep 5 2017 12:09 PM

బాహుబలి కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువ : సల్మాన్

బాహుబలి కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువ : సల్మాన్

ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి సినిమాపై బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి సినిమాపై బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన తరువాత కూడా చాలా కాలం పాటు బాలీవుడ్ హీరోలు ఈ సినిమాపై స్పందించలేదు. అయితే ఇండియన్ సినిమా అంటే బాహుబలే అనే స్థాయి కలెక్షన్లు నమోదు కావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షారూఖ్, ఆమిర్ లాంటి స్టార్స్ సినిమా చూడలేదు గానీ.. బాహుబలి గొప్ప సినిమా అంటూ కామెంట్ చేశారు.

తాజాగా ఈ లిస్ట్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరిపోయాడు. ఈద్ కానుకగా రిలీజ్ అవుతున్న ట్యూబ్లైట్ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సల్మాన్.. బాహుబలి కలెక్షన్లపై స్పందించాడు. అయితే బాహుబలి గొప్ప సినిమానే అన్న సల్మాన్, బాహుబలి కలెక్షన్ల కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువంటూ మెలికపెట్టాడు. బాహుబలి సినిమాను నాలుగేళ్ల పాటు తెరకెక్కించారు. నేను ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వస్తున్నా.. అవన్ని కలుపుకుంటే బాహుబలి వసూళ్ల కన్నా నా కలెక్షన్లే ఎక్కువ కదా..! అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement