31 ఇయర్స్‌ ఇండస్ర్టీ..థ్యాంక్స్‌ ! | Salman Khan Completes Three Decades In Bollywood | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ : 31 ఇయర్స్‌ ఇండస్ర్టీ..

Aug 28 2019 1:20 PM | Updated on Aug 28 2019 2:29 PM

Salman Khan Completes Three Decades In Bollywood - Sakshi

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సినీ పరిశ్రమలోకి ఎంటరై 31 వసంతాలను పూర్తిచేసుకున్నారు. మూడు దశాబ్ధాలుగా తనను ఆదరిస్తున్న భారత సినీ పరిశ్రమకు, అభిమానులకు ఈ సందర్భంగా బాలీవుడ్‌ కండలవీరుడు కృతజ్ఞతలు తెలిపారు. 1988లో ‘బీవీ హో తో ఐసీ’  మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన సల్మాన్‌ ఖాన్‌ ఆ తర్వాత ఎన్నో మరపురాని చిత్రాలతో సినీ అభిమానులను అలరించారు. తన సుదీర్ఘ సినీ ప్రస్దానంలో మూడు దశాబ్ధాలు దాటిన నేపథ్యంలో తన చిన్ననాటి ఫోటోతో కూడిన పోస్ట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రముఖ సినీ రచయిత సలీం ఖాన్‌ కుమారుడైన సల్మాన్‌ మైనే ప్యార్‌ కియా, సనం బేవఫా, సాజన్‌, హమ్‌ ఆప్కే హై కౌన్‌ , కరణ్‌ అర్జున్‌ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. 2000 సంవత్సరం తర్వాత దబాంగ్‌, వాంటెడ్‌, ఏక్‌ థా టైగర్‌, కిక్‌, టైగర్‌ జిందా హై వంటి హై యాక్షన్‌ ఫిల్మ్స్‌తోనూ సత్తా చాటి నవతరానికీ చేరువయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement