అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి | Salman Khan, Arbaaz Khan arrive in Indore for Dabangg 3 shoot | Sakshi
Sakshi News home page

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

Apr 1 2019 12:03 AM | Updated on Apr 3 2019 6:34 PM

Salman Khan, Arbaaz Khan arrive in Indore for Dabangg 3 shoot - Sakshi

బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ రేంజ్‌ గురించి ప్రత్యేకించి చర్చించుకోనవసరం లేదు. అంత పెద్ద స్టార్‌ ఆయన. హీరోగా ఎన్నో బాక్సాఫీసు రికార్డులను సెట్‌ చేశారు. అవార్డులనూ అందుకున్నారు. వివాదాల్లోనూ భాగమయ్యారు. అయితే సల్మాన్‌ఖాన్‌ తన కెరీర్‌ను హీరోగా ప్లాన్‌ చేసుకోలేదు. ‘‘హీరోగా చాలా సక్సెస్‌ అయ్యారు? మీకు ప్రస్తుతం డైరెక్షన్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా?’’అన్న ప్రశ్నను సల్మాన్‌ను అడిగితే...‘‘నా కెరీర్‌ను డైరెక్టర్‌గానే మొదలు పెట్టాలని అప్పట్లో నిర్ణయించుకున్నాను.

కానీ అలా జరగలేదు. హీరో అయ్యాను. దేవుడికి థ్యాంక్స్‌. ఇక.. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో నటించమని అవకాశాలు వచ్చాయి. కానీ డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్నప్పుడే వెబ్‌సిరీస్‌లో నటించడం గురించి ఆలోచిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్‌ నటించిన ‘భారత్‌’ ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. ఆ తర్వాత ‘దబాంగ్‌ 3, వెటరన్‌’ సినిమాల్లో నటించనున్నారు సల్మాన్‌ఖాన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement