కాసేపట్లో సల్మాన్ ఖాన్కు శిక్ష ఖరారు | Salman convicted, court to announce sentence on Thursday | Sakshi
Sakshi News home page

కాసేపట్లో సల్మాన్ ఖాన్కు శిక్ష ఖరారు

May 6 2015 12:18 PM | Updated on Sep 3 2017 1:33 AM

హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు కాసేపట్లో శిక్ష ఖరారు కానుంది.

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు కాసేపట్లో శిక్ష ఖరారు కానుంది. మధ్యాహ్నం 1:10 గంటలకు తుది తీర్పు వెలువడనుంది. సుదీర్ఘకాలం విచారణ సాగిన ఈ కేసులో సల్మాన్ నేరం చేసినట్టు బుధవారం ముంబై సెషన్స్ కోర్టు నిర్ధారించింది. న్యాయమూర్తి డీ డబ్ల్యూ దేశ్పాండే ఈ మేరకు తీర్పు వెలువరించారు.  పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ మద్యం మత్తులో కారు నడపడం వల్ల రోడ్డు పక్కన ఉండే ఫుట్ పాత్పై పడుకున్న వారిపై వాహనం దూసుకెళ్లినట్టు కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆయనపై నమోదైన అభియోగాలు అన్ని కూడా నిజమే అని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement