ప్రేమికుల దినోత్సవం సాక్ష్యంగా...

Sakshyam movie First look - Sakshi

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సాక్ష్యం’. శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హీరో హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిషేక్‌ నామా మాట్లాడుతూ– ‘‘సాక్ష్యం’లో హీరో, హీరోయిన్‌ పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. శ్రీవాస్‌ వారి పాత్రలు రాసిన విధానం బాగుంది. ఆయన దర్శకత్వ శైలి పూర్తిగా మారిపోయింది.

సినిమాలో కీలకమైన ఫైట్‌ సీక్వెన్స్‌ని పీటర్‌ హెయిన్‌ మాస్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెరకెక్కిస్తున్నారు.ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతున్న క్లైమాక్స్‌ షూటింగ్‌లో శ్రీనివాస్, పూజ  పాల్గొనగా కాంబినేషన్‌ సీన్స్‌ తీస్తున్నాం. కీలక పాత్రధారులైన జయప్రకాశ్, పవిత్ర లోకేష్, ‘వెన్నెల’ కిషోర్‌ల కాంబినేషన్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అన్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్‌ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్‌ ఎ.విల్సన్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్‌ పిక్చర్స్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top