కడుపులోని బిడ్డకు పేరు పెట్టిన హీరో! | Saif-Kareena inspired by Shahid-Mira, to name their child Saifeena?! | Sakshi
Sakshi News home page

కడుపులోని బిడ్డకు పేరు పెట్టిన హీరో!

Sep 27 2016 1:17 PM | Updated on Sep 4 2017 3:14 PM

కడుపులోని బిడ్డకు పేరు పెట్టిన హీరో!

కడుపులోని బిడ్డకు పేరు పెట్టిన హీరో!

బాలీవుడ్ జంట షాహిద్ కపూర్, మీరా రాజ్పుట్ బాటలో మరో జోడీ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నడుస్తున్నారు.

బాలీవుడ్ జంట షాహిద్ కపూర్, మీరా రాజ్పుట్ బాటలో మరో జోడీ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నడుస్తున్నారు. షాహిద్, మీరా.. ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనివ్వడం, ఇద్దరి పేర్లూ కలసి వచ్చేలా ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలను కలపి పాపకు మిషా అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీతో ఉన్న కరీన డిసెంబర్లో బిడ్డకు జన్మ ఇవ్వనుంది. సైఫ్, కరీనా తమకు పుట్టబోయే బిడ్డకు ముందుగా పేరు నిర్ణయించినట్టు సమాచారం. షాహిద్, మీరా దంపతుల మాదిరే.. సైఫ్, కరీనాలు ఇద్దరి పేర్లు కలసి వచ్చేలా కడుపులోని బిడ్డకు సైఫీనా అనే పేరు పెట్టాలని భావిస్తున్నారు. ఈ పేరును సైఫ్ ఎంపిక చేసినట్టు కరీనా ఓ చాటింగ్లో వెల్లడించింది.  

సైఫ్, కరీనా డేటింగ్ చేయడం మొదలు పెట్టాక మీడియా, అభిమానులు వారిని సైఫీనాగా పిలిచేవారు. ఇదే పేరును తమ బిడ్డకు పెట్టాలని సైఫ్ భావిస్తున్నాడు. ఈ పేరు కరీనాకు కూడా నచ్చినట్టు సమాచారం. కరీనా ప్రెగ్నెన్సీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలో ఓ బిడ్డకు జన్మ ఇవ్వనున్నట్టు సైఫ్, కరీనా సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. సైఫ్, కరీనా త్వరలో దుబాయ్ వెళ్లనున్నారు. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని అక్టోబర్లో తిరిగిరానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement