చిన్నమ్మగా సాయిపల్లవి

Sai Pallavi In Sasikala Role in Jayalalithaa Biopic - Sakshi

సినిమా: అమ్మ(జయలలిత) బయోపిక్‌ అంటే ఆ చిత్రంలో చిన్నమ్మ (శశికళ) పాత్ర కచ్చితంగా ఉంటుంది. జయ రాజకీయ జీవితంలో ఆమె స్నేహితురాలిగా శశికళను ప్రధాన భూమిక పోషించారు. జయలలిత ఆనందంలోనూ, విషాదంలోనూ చిన్నమ్మ భాగం ఎంతో. జయలలిత అంతిమ దశలోనూ శశికళది చర్చనీయాంశ భూమిక అన్నది తెలిసిందే. ఇదిలాఉండగా ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి కోలీవుడ్‌లో పోటీ పెరిగింది. దర్శకుడు విజయ్, నవ దర్శకురాలు ప్రియదర్శిని ఇందుకు సన్నాహాలు చేస్తున్నారు. ది ఐరన్‌ లేడీ పేరుతో ప్రియదర్శిని తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని జయలలిత పుట్టిన రోజు సందర్భంగా పిబ్రవరి 24న ప్రారంభించనున్నారు.

ఇందులో అమ్మగా నటి నిత్యామీనన్‌ నటించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఇప్పటికే తనను తాను తయారు చేసుకునే పనిలో ఉంది. ఇక జయలలిత నెచ్చలి శశికళగా నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.దర్శకుడు విజయ్‌ కూడా జయలలిత పుట్టిన రోజునే ఆమె బయోపిక్‌ను ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు.ఇందులో అమ్మ పాత్రలో నటి విద్యాబాలన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. శశికళ పాత్రలో నటి సాయిపల్లవిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తాజా సామాచారం. సాయిపల్లవిని కోలీవుడ్‌కు దియా చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు ఈయనే. తాజాగా ధనుశ్‌కు జంటగా నటించిన మారి–2 చిత్రం ఇటీవల విడుదలై సాయిపల్లవికి మంచి పేరు తెచ్చి పెట్టింది. విజయ్‌ కోసం సాయిపల్లవి శశికళగా నటించే అవకాశం ఉంటుందని భావించవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top