సెల్ఫీ డాక్టర్‌ అయిపోతా

Sai Pallavi forgets many lessons - Sakshi

యాక్టర్‌గా మారారు డాక్టర్‌ సాయి పల్లవి. మెడిసిన్‌ చదువుతూనే సినిమాలో నటించే అవకాశం రావడంతో మలయాళ ‘ప్రేమమ్‌’లో నటించారు. ఆ తర్వాత మెడిసిన్‌ పూర్తి చేసి పూర్తి స్థాయిగా సినిమాల్లో కనిపిస్తున్నారు. మరి యాక్టర్‌గా బిజీ అయిపోయారు. ప్రాక్టీస్‌ మొదలుపెట్టారా? అనే ప్రశ్నకు సాయి పల్లవి సమాధానమిస్తూ – ‘‘యాక్టర్‌గా మారాక ప్రాక్టీస్‌ చేయడమే మరచిపోయాను. కానీ కచ్చితంగా చదివింది రివిజన్‌ చేయాలి.

మెడిసిన్‌లో చదువుకున్న చాలా విషయాలు మర్చిపోతున్నాను అని అర్థం అవుతోంది. ఎంతో కష్టపడి నేర్చుకున్నదంతా అలా మర్చిపోతుంటే చాలా బాధగా ఉంది. ఒకవేళ నేను ప్రాక్టీస్‌ కోసం హాస్పిటల్‌కు వెళ్లినా నేను డాక్టర్‌ అంటే నన్ను ఎవ్వరూ నమ్మరనుకుంటున్నాను.  మందులచీటీ రాసివ్వండి అనే వాళ్లకంటే సెల్ఫీ ఇవ్వండి అనేవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉంటారనుకుంటున్నాను. సంతోషమైన విషయమేంటంటే మా ఇంట్లో నేనొక్కదాన్నే డాక్టర్‌ని. కాబట్టి మావాళ్లకు వేరే ఆప్షన్‌ లేదు. నేను ప్రయోగాలు చేయడానికి వెతుక్కునే పని లేదు’’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top