పెళ్లిపై సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం

Sai Pallavi Decided Not Get Married - Sakshi

ప్రేమమ్‌ సినిమా సౌత్ ఇండస్ట్రీ ని ఊపేసిన మల్లార్‌ బ్యూటీ సాయి పల్లవి. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలపై స్పందించిన తీరు అభిమానులకు షాక్‌ ఇచ్చారు. పెళ్లి విషయంలో ఎదురురైన ప్రశ్నకు సాయి పల్లవి షాకింగ్ ఆన్సర్‌ ఇచ్చారు.

తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పింది ఈ భామ. జీవితాంతం ఇలాగే ఉంటూ తన తల్లి దండ్రుల బాగోగులను చూసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలిపారు. సాయి పల్లవి నిర్ణయంతో అభిమానులు షాక్‌ అయ్యారు. ఇటీవల మారి 2 తో ఆకట్టుకున్న ఈ భామ త్వరలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్జీకే సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులో రానా దగ్గుబాటి సరసన ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top