ఆస్కార్కు సాయికుమార్ సినిమా | sai kumar film rangi taranga in oscar race | Sakshi
Sakshi News home page

ఆస్కార్కు సాయికుమార్ సినిమా

Dec 22 2015 3:50 PM | Updated on Sep 3 2017 2:24 PM

ఆస్కార్కు సాయికుమార్ సినిమా

ఆస్కార్కు సాయికుమార్ సినిమా

అంతర్జాతీయ సినీ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ఫైనల్స్కు మన తెలుగు నటుడి సినిమా ఎంపికైంది. అయితే ఈ ఘనత సాధించింది తెలుగు సినిమా మాత్రం కాదు. దక్షిణాదిలో ప్రముఖ...

అంతర్జాతీయ సినీ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పోటీకి మన తెలుగు నటుడి సినిమా ఎంపికైంది. అయితే ఈ ఘనత సాధించింది తెలుగు సినిమా మాత్రం కాదు. దక్షిణాదిలో ప్రముఖ నటుడిగా ఉన్న సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ సినిమా 'రంగితరంగ' ఆస్కార్ ఫైనల్స్కు ఎంపిక అయ్యింది. ఇటీవలే తాత అయిన సాయికుమార్ ఈ వార్తతో మరింత ఆనందంగా ఉన్నారు.

కొత్త దర్శకుడు అనూప్ భండారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగితరంగ' కమర్షియల్ సక్సెస్ సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పటికే ఆస్కార్ అవార్డ్స్ ఫైనల్స్కు చేరిన ఈ సినిమా వచ్చే నెల జరగనున్న 88వ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్లో అవార్డు సాధించటం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. హీరోగా మంచి విజయాలు సాధించిన సాయికుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా కొనసాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement