'పెద్ది' సర్‌ప్రైజ్‌.. పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్‌తో సినిమా | Sai Kumar Enters In Ram Charan's Peddi Movie | Sakshi
Sakshi News home page

'పెద్ది' సర్‌ప్రైజ్‌.. ప్రముఖ సీనియర్‌ నటుడు ఎంట్రీ

Apr 13 2026 10:46 AM | Updated on Apr 13 2026 11:03 AM

Sai Kumar Enters In Ram Charan's Peddi Movie

రామ్‌ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘పెద్ది’. కొద్దిరోజుల క్రితం విడుదలైన గ్లింప్స్‌ వీడియో సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్‌ చేసింది. దీంతో పెద్ది రాక కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి సీనియర్‌ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడైంది. సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా ఉన్న ఈ అప్‌డేట్‌ చాలామందిలో ఆసక్తిని పెంచుతుంది.

గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 'పెద్ది'లో సినీయర్‌ నటుడు సాయికుమార్‌ నటిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. ఇటీవల ఒక అభిమాని చిత్రీకరించిన వీడియోతో ఈ చిత్రంలో ఆయన కూడా భాగమని వెల్లడైంది. పదేళ్ల క్రితం విడుదలైన 'ఎవడు' తర్వాత రామ్ చరణ్‌తో ఆయన తిరిగి కలవడం ఇదే మొదటిసారి. ఈ వార్త అభిమానులను ఉత్సాహపరుస్తున్నప్పటికీ, ఆయన పాత్ర వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఈ అంశం పెద్దిపై మరింత క్రేజ్‌ పెంచుతోంది.  ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణపు చివరి దశలో ఉంది. ఇంకా ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించాల్సి ఉంది. అది పూర్తయిన తర్వాత, చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్‌ ఇరానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై, ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో ఘనంగా విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ‘పెద్ది’ విడుదల కానుందని ప్రకటించారు. అయితే, మరోసారి వాయిదా పడే ఛాన్స్‌ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement