సిక్స్‌ ప్యాక్‌ తేజ్‌

Sai Dharam Tej Shows his Six Pack in Prathi Roju Pandage - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌.. రీసెంట్‌గా రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో విలన్ల బెండు తీశారు. ఇంకా ఆరు పలకల దేహంతో కనిపించిన హీరోలు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సాయితేజ్‌ పేరు కూడా చేరబోతోంది. మారుతి దర్శకత్వంలో సాయితేజ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్‌ కీలక పాత్రధారులు. ఈ సినిమాలోని రెండు యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో సాయి తేజ్‌ సిక్స్‌ప్యాక్‌ బాడీతో కనిపిస్తారు. ఆ రెండు ఫైట్స్‌లో హోమం నేపథ్యంలో వచ్చే ఫైట్‌ సీన్‌ ఒకటి. ఈ రెండు ఫైట్లు హైలైట్‌గా నిలుస్తాయట. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top