మెగా హీరో ద్విపాత్రాభినయం..! | Sai Dharam Tej Dual Role in Vv Vinayak Movie | Sakshi
Sakshi News home page

మెగా హీరో ద్విపాత్రాభినయం..!

Sep 5 2017 9:55 AM | Updated on Sep 17 2017 6:26 PM

మెగా హీరో ద్విపాత్రాభినయం..!

మెగా హీరో ద్విపాత్రాభినయం..!

మెగా ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో

మెగా ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో ఆకట్టుకున్న సాయి, తరువాత ఫ్లాప్ లు పలకరించటంలో ఢీలా పడిపోయాడు. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినిమా ధరమ్ తేజ్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. ప్రస్తుతం రచయిత, దర్శకుడు బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు సాయిధరమ్ తేజ్.

ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సాయి. వినాయక్ లాంటి మాస్ స్పెషలిస్ట్ తో సినిమా చేస్తే మాస్ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకొవచ్చని భావిస్తున్నాడు. అంతేకాదు వినాయక దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో సాయి ధరమ్ తేజ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో డ్యూయల్ రోల్ చేయించి సూపర్ హిట్స్ సాధించిన వినాయక్ సాయి కి కూడా హిట్ ఇస్తాడేమో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement