‘చిత్రలహరి’పై ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ | Sai Dharam Tej Chitralahari Latest Update | Sakshi
Sakshi News home page

Aug 12 2018 12:29 PM | Updated on Aug 12 2018 2:09 PM

Sai Dharam Tej Chitralahari Latest Update - Sakshi

కొద్ది రోజులుగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలో ‘చిత్రలహరి’ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త మేకోవర్‌లో రెడీ అయిన వెంటనే కొత్త సినిమా పట్టా లెక్కనుంది.

ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిత్రలహరి అనేది ఓ బార్‌ పేరన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే తాజాగా మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. చిత్ర.. లహరి అనేవి సినిమాలో హీరోయిన్ల పేర్లన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇప్పటికే ఒక హీరోయిన్‌గా నివేదా థామస్‌ ను ఎపింక చేయగా మరో హీరోయిన్‌ ను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్‌. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నేను శైలజ ఫేం కిశోర్‌ తిరుమల దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement