36 ఏళ్ల తరువాత మెగాస్టార్‌తో..! | Sai Chand Share Screen Space With Chiranjeevi After 36 Years | Sakshi
Sakshi News home page

Sep 14 2018 12:45 PM | Updated on Sep 14 2018 7:44 PM

Sai Chand Share Screen Space With Chiranjeevi After 36 Years - Sakshi

ఖైదీ నంబర్‌ 150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏదో విధంగా వార్తల్లో నిలిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దాదాపు 36 ఏళ్ల తరువాత ఓ టాలీవుడ్ సీనియర్‌ నటుడు ఈ సినిమాలో మెగాస్టార్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు. 

ఇటీవల ఫిదా సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్‌ యాక్టర్‌ సాయిచంద్‌. 80లలో పలు చిత్రాల్లో నటించిన సాయి చంద్‌ తరువాత నటనకు దూరమయ్యారు. రీఎంట్రీలో మాత్రం ఆసక్తికర సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా సైరాలో నరసింహారెడ్డి ముఖ్య అనుచరుడిగా చిరుతో కలిసి నటిస్తున్నారు సాయి చంద్‌. 36 ఏళ్ల కిందట మంచు పల్లకి సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. తిరిగే ఇన్నేళ్ల తరువాత మెగాస్టార్‌తో కలిసి నటిస్తుండటంపై సాయిచంద్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement