'సాహో' ద‌ర్శ‌కుడి నిశ్చితార్థం | Saho Director Sujeeth Reddy Engaged With Dr Pravalika | Sakshi
Sakshi News home page

వైర‌ల్‌గా 'సాహో' డైరెక్ట‌ర్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

Jun 11 2020 3:07 PM | Updated on Jun 11 2020 3:42 PM

Saho Director Sujeeth Reddy Engaged With Dr Pravalika - Sakshi

ఓ ర‌కంగా లాక్‌డౌన్ సెల‌బ్రిటీల‌కు బాగానే క‌లిసొచ్చిన‌ట్టుంది. క‌రోనా కాలంలోనే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, క‌మెడియ‌న్ మ‌హేశ్ ఇప్ప‌టికే పెళ్లి బాజాలు మోగించ‌గా రానా త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్నాడు. ఇప్పుడీ జాబితాలోకి 'సాహో' ద‌ర్శ‌కుడు సుజీత్ రెడ్డి కూడా ఎంట‌ర‌య్యాడు. ఈ యువ ద‌ర్శ‌కుడు త‌ను ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేయ‌నున్నాడు. ఈ మేర‌కు బుధ‌వారం(జూన్ 10)  హైద‌రాబాద్‌కు చెందిన డెంటిస్ట్ ప్ర‌వ‌ళికతో ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగిపోయింది. ఇరు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సింపుల్‌గా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ్గా త్వ‌రలోనే పెళ్లి ముహూర్తం పెట్టుకోనున్నారు. (డెంటిస్ట్‌తో‌ ప్రేమ.. జూన్‌ 10న నిశ్చితార్థం?)

ప్ర‌స్తుతం అత‌డి నిశ్చితార్థ వేడుక ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా 23 ఏళ్ల వ‌య‌సులోనే సుజీత్ 'ర‌న్ రాజా ర‌న్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా వెండితెర‌పై త‌న అద‌ష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. ఆ సినిమా సూప‌ర్ హిట్ కొట్ట‌డంతో ఏకంగా ప్రభాస్‌తో క‌లిసి ప‌ని చేసే ఛాన్స్ కొట్టేశాడు. హాలీవుడ్ అంత‌టి రేంజ్‌లో 'సాహో' చిత్రాన్ని తెర‌కెక్కించి విశేష‌ గుర్తింపు సాధించాడు. ప్ర‌స్తుతం సుజీత్ 'లూసిఫ‌ర్' రీమేక్ తెర‌కెక్కించ‌నుండ‌గా ఇందులో మెగాస్టార్ చిరంజీవి న‌టించ‌నున్నాడు. ఇంకా స్క్రిప్ట్‌ను మెరుగులు దిద్దుతూ ఉన్నందున ఈ ఏడాది చివ‌రికి ఆ చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. (శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజేందర్‌)

Advertisement
 
Advertisement
Advertisement