
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి కీలక షెడ్యూల్ బళ్లారి జిల్లా హోస్‌పేట్‌లో జరిగింది. అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘కర్ణాటకలోని హోస్‌పేట్‌లో మైన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్ తీశాం.
200 మంది జూనియర్ ఆర్టిస్టులతో 15 రోజులు ఏకధాటిగా చిత్రీకరించిన ఈ షెడ్యూల్‌లో శ్రీనివాస్‌తోపాటు పూజా హెగ్డే, కీలకపాత్రధారులు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్ పూర్తయింది. ‘సాక్ష్యం’ లోని యాక్షన్ ఎపిసోడ్స్ తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తాయనే నమ్మకం ఉంది. శ్రీనివాస్ డూప్ లేకుండా చాలా కష్టపడి చేశాడు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ. విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: దేవిశ్రీప్రసాద్.