‘సాక్ష్యం’ నుంచి సౌందర్య లహరి సాంగ్‌ | Saakshyam First Song Is Released | Sakshi
Sakshi News home page

May 4 2018 5:53 PM | Updated on Aug 3 2019 12:45 PM

Saakshyam First Song Is Released - Sakshi

బడా నిర్మాత బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ హీరోకు ఇప్పటి వరకు తగిన గుర్తింపు రాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ యువ హీరో మొదట్నుంచీ స్టార్‌ హీరోయిన్లతోనే జతకడుతున్నారు. గతేడాది జయ జానకి నాయకా అంటూ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో బిజీగా ఉన్నారు. 

ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈరోజు (మే 4) సినిమాలోని మొదటి సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. లహరి ..లహరి..అంటూ సాగే ఈ మెలొడిసాంగ్‌ను అందమైన లొకేషన్‌లో  తెరకెక్కించినట్లు లిరికల్‌ వీడియో సాంగ్‌ చూస్తే తెలుస్తోంది. అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యాన్ని అందించగా.. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీత సారథ్యంలో... జితిన్‌, ఆర్తిలు ఆలపించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement