ఆనందంతో నాన్నగారు హత్తుకున్నారు | S3 Success Meet in hyderabad | Sakshi
Sakshi News home page

ఆనందంతో నాన్నగారు హత్తుకున్నారు

Feb 14 2017 11:05 PM | Updated on Sep 5 2017 3:43 AM

ఆనందంతో నాన్నగారు హత్తుకున్నారు

ఆనందంతో నాన్నగారు హత్తుకున్నారు

‘‘ఎస్‌ 3’ అందరికంటే నాకు చాలా ఇంపార్టెంట్‌.

‘‘ఎస్‌ 3’ అందరికంటే నాకు చాలా ఇంపార్టెంట్‌. ఈ నెల 9న ఏ పండగా లేదు. అయినా, ‘సింగం’ ప్రేమికులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఇంత పెద్ద హిట్‌ చేశారు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని హీరో సూర్య అన్నారు. సూర్య, అనుష్క, శ్రుతీహాసన్‌ హీరో హీరోయిన్లుగా హరి  దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన ‘ఎస్‌ 3’ ఇటీవల విడుదలైంది. మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు.

సూర్య మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ‘ఫిల్మ్‌ ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు’ అందుకున్నప్పుడు నేను, కార్తీ ఆయన్ను హత్తుకున్నాం. ఇప్పుడు ‘ఎస్‌ 3’ చూసి, నాన్నగారు నన్ను హత్తుకున్నారు. అది మాటల్లో చెప్పలేని ఆనందం. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళా ప్రేక్షకులు డైలాగ్స్‌కి చప్పట్లు కొడుతున్నారు. దక్షిణాది చిత్రసీమలో ఏడాదికి వెయ్యి సినిమాలు రిలీజవుతున్నాయి. కానీ, ఏడు శాతం చిత్రాలు మాత్రమే హిట్‌ అవుతున్నాయి. ఇది చాలా పూర్‌. ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో వైవిధ్యమైన సినిమా చేస్తున్నా. కీర్తీ సురేశ్‌ కథానాయిక. రమ్యకృష్ణగారు ముఖ్య పాత్ర చేస్తున్నారు’’ అన్నారు.

‘‘ఎస్‌ 3’ హిట్‌ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ చిత్రం వసూళ్లు బాగున్నాయి. మీతో (సూర్య, హరి) నా ప్రయాణం నిరంతరాయంగా కొనసాగాలి’’ అని శివకుమార్‌ అన్నారు. దర్శకుడు హరి మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు, సూర్య అభిమానులకు చాలా చాలా కృతజ్ఞతలు. ‘ఎస్‌ 3’ విజయం చాలా ఎనర్జీ ఇచ్చింది. ‘సింగమ్‌’ సిరీస్‌లో ‘ఎస్‌ 4’ మూవీ వస్తుంది. కానీ, వెంటనే కాదు. ఐదారేళ్లు పడుతుంది’’ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement