బాగా లేదంటే డబ్బు వాపస్‌ | RX 100 Movie Audio Launch | Sakshi
Sakshi News home page

బాగా లేదంటే డబ్బు వాపస్‌

Jul 2 2018 12:35 AM | Updated on Jul 2 2018 12:35 AM

RX 100 Movie Audio Launch - Sakshi

చైతన్‌ భరత్, అజయ్‌ భూపతి, అశోక్‌రెడ్డి, పాయల్, కార్తికేయ

కార్తికేయ, పాయల్‌ రాజపుత్‌ జంటగా రూపొందిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. ‘యాన్‌ ఇన్‌క్రెడిబుల్‌ లవ్‌ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్‌ కందుకూరి, హీరో హవీశ్‌ విడుదల చేశారు. నిర్మాత అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ –‘‘నా భార్య నాకు ఇచ్చిన ఫస్ట్‌ గిఫ్ట్‌ ‘ఆర్‌ ఎక్స్‌ 100’ బైక్‌. అజయ్‌గారు కథ చెప్పినప్పుడు షాకయ్యాను. తర్వాత గ్రేట్‌గా ఫీలయ్యాను. ట్రైలర్‌ విడుదలయ్యాక అందరూ మా సినిమా గురించి మాట్లాడుతుండటం గర్వంగా ఉంది.

‘7/జి బృందావన కాలనీ, సైరాట్, ప్రేమిస్తే’ సినిమాల్లో ఎంత కంటెంట్‌ ఉందో దానికి మించిన కంటెంట్‌ మా సినిమాలో ఉంటుంది. ఈనెల 12న సినిమా రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను స్క్రిప్ట్‌ పట్టుకుని తిరుగుతున్న రోజుల్లో నాపై నమ్మకంతో నన్ను కలిసిన తొలి వ్యక్తి చైతన్‌ భరద్వాజ్‌. తర్వాత క్రమంగా ‘ఆర్‌ ఎక్స్‌ 100’ టీమ్‌ ఏర్పడింది. చాలా హానెస్ట్‌గా చేసిన సినిమా ఇది’’ అన్నారు డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. ‘‘మా సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. సినిమా చూశాక పెట్టిన డబ్బులు వేస్ట్‌ అయ్యాయని ప్రేక్షకులు అంటే వారికి నేను డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా’’ అన్నారు కార్తికేయ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement