సిగ్గుండాలి.. నా బాడీ ఎలా ఉంటే మీకెందుకు: స్టార్‌ హీరోయిన్‌ | Payal Rajput Hits Back at BodyShaming Trolls | Sakshi
Sakshi News home page

Payal Rajput: నా శరీరం.. నా ఇష్టం..: పాయల్‌

Oct 21 2026 3:07 PM | Updated on Oct 21 2026 3:21 PM

Payal Rajput Hits Back at BodyShaming Trolls

పాయల్‌ రాజ్‌పుత్ శరీరాకృతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శరీరం, తన రూపం గురించి వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.  ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు.

‘నా శరీరం, నా సైజు, నా గర్వం. ఇవి మీకు సంబంధించిన విషయాలు కావు. మీ హద్దుల్లో మీరు ఉండండి. మీ పని మీరు చేసుకోండి’ అంటూ బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్న వారికి గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సినిమాల విషయానికి వస్తే..
తెలుగులో ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఆమె వరుసగా ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాల్లో నటించింది. 2023లో వచ్చిన మంగళవారం సినిమాలో మరో సారి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ‘రక్షణ’చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించింది.

(ఇదీ చదవండి: హీరోయిన్‌ కాయదు ఎంగిలి చేసిన బాటిల్ రూ.3 లక్షలా?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement