బన్నీ-త్రివిక్రమ్‌ మూవీ స్టోరీ అదేనా..? | Rumors On Trivikram And Allu Arjun Movie Story | Sakshi
Sakshi News home page

Jan 1 2019 3:57 PM | Updated on Jan 1 2019 7:12 PM

Rumors On Trivikram And Allu Arjun Movie Story - Sakshi

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు న్యూ ఇయర్‌ కానుకగా.. కొత్త సినిమా అప్‌డేట్‌ను ప్రకటించేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో గీతా ఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌పై ఈ చిత్రం రూపొందనుందని నిర్మాతలు ప్రకటించేశారు. 

అయితే ఈ మూవీ స్టోరీ లైన్‌ ఇదే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుందని గాసిప్స్‌ వస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సన్నాఫ్‌ సత్యమూర్తి కథ కూడా అదే కావడం.. ఆ మూవీ హిట్‌ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి మరోసారి ఇలాంటి కథను ఎంచుకున్నారా? అదే నిజమైతే.. త్రివిక్రమ్‌ ఈసారి ఎలాంటి మ్యాజిక్‌ క్రియేట్‌ చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించి.. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను చిత్రయూనిట్‌ ప్రారంభించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement