అదిరిపోయిన బాలయ్య 'రూలర్' ఫస్ట్ సాంగ్ | Ruler First Song Adugo Action Hero Release | Sakshi
Sakshi News home page

అడుగడుగో యాక్షన్ హీరో.. అదిరిపోయిన ‘రూలర్‌’ సాంగ్‌

Dec 1 2019 12:45 PM | Updated on Dec 1 2019 4:24 PM

Ruler First Song Adugo Action Hero Release - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రూలర్’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్లో నటించారు. డిసెంబర్‌ 20న ఈ సినిమా విడుల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ చిత్రం నుంచి ‘అడుగడుగో యాక్షన్ హీరో.. అరే దేఖో యారో..’ అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. రామ‌జోగయ్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, సాయిచ‌ర‌ణ్ సాయిచ‌ర‌ణ్ భాస్కరుని ఆల‌పించాడు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందించాడు. సినిమాలో బాలకృష్ణ పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా లిరిక్స్‌ ఉన్నాయి.  హీరో పవర్ తెలియజేసేలా రామ‌జోగయ్య లిరిక్స్‌ అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement