తమిళంలో 16న రుద్రమదేవి రిలీజ్..? | Rudhramadevi Tamil version to release on October 16 | Sakshi
Sakshi News home page

తమిళంలో 16న రుద్రమదేవి రిలీజ్..?

Oct 6 2015 12:59 PM | Updated on Aug 11 2019 12:52 PM

తమిళంలో 16న రుద్రమదేవి రిలీజ్..? - Sakshi

తమిళంలో 16న రుద్రమదేవి రిలీజ్..?

గుణశేఖర్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. పెద్ద సినిమాలు పోటిలో ఉన్న బరిలో దిగేందుకు సిద్దమంటూ రిలీజ్కు రెడీ అవుతున్న రుద్రమదేవికి టాలీవుడ్లో లైన్ క్లియర్ అయినా...

గుణశేఖర్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. పెద్ద సినిమాలు పోటిలో ఉన్నా బరిలో దిగేందుకు సిద్దమంటూ రిలీజ్కు రెడీ అవుతున్న రుద్రమదేవికి టాలీవుడ్లో లైన్ క్లియర్ అయినా కోలీవుడ్లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా తమిళ వర్షన్ ను ఒక వారం ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట కోలీవుడ్ నిర్మాతలు.

పులి సినిమా టాక్ పరంగా ఆకట్టుకోలేకపోయినా, కలెక్షన్ల పరంగా మాత్రం మంచి ఫాంలో ఉంది. దీంతో వెంటనే రుద్రమదేవి రిలీజ్ అయితే రెండు సినిమాల వసూళ్ల మీద ప్రభావం పడుతుందన్న ఆలోచనతో ఈ సినిమా రిలీజ్ ను ఒక వారం వాయిదా వేయాలని భావిస్తున్నారట. పులి సినిమాను తమిళనాట రిలీజ్ చేసిన తెనండల్ ఫిలింస్ రుద్రమదేవి సినిమాను కూడా రిలీజ్ చేస్తోంది. దీంతో అక్టోబర్ 16న రుద్రమదేవి తమిళ వర్షన్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ హిస్టారికల్ త్రీడి స్టీరియో స్కోపిక్ సినిమా అక్టోబర్ 9న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే తమిళ వర్షన్ను కూడా అదే రోజు రిలీజ్ చేయాలని భావించినా ఆ అవకాశం కనిపించటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement