ఆస్కార్ బరిలో రుద్రమదేవి | Rudhramadevi in Oscar Race | Sakshi
Sakshi News home page

ఆస్కార్ బరిలో రుద్రమదేవి

Aug 12 2016 2:02 PM | Updated on Sep 4 2017 9:00 AM

ఆస్కార్ బరిలో రుద్రమదేవి

ఆస్కార్ బరిలో రుద్రమదేవి

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భారీ చారిత్రక చిత్రం రుద్రమదేవి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు తెలుగు సినిమా స్థాయిని

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భారీ చారిత్రక చిత్రం రుద్రమదేవి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఎన్నో రికార్డ్లతో పాటు అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది.

రుద్రమదేవి సినిమాను బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం క్యాటగిరీలో ఆస్కార్కు పంపేందుకు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రికమండ్ చేసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు దర్శకుడు గుణశేఖర్. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని పక్కన పెట్టి ఆస్కార్ బరిలో నిలవటంతో రుద్రమదేవి యూనిట్ ఎంతో సంతోషంగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement