RRR Movie Shooting Begins, Rajamouli Shared the First Picture in Twitter - Sakshi
Sakshi News home page

Nov 19 2018 11:48 AM | Updated on Nov 19 2018 1:36 PM

RRR Movie Shoot Started - Sakshi

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాజమౌళి ట్విటర్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

అలాగే రాజమౌళి తొలి షాట్‌కు దర్శకత్వం వహిస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. చరణ్‌ రెడీ, తారక్‌ రెడీ అంటూ రాజమౌళి డైరెక్ట్‌ చేస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర పూజ కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో సినీ ప్రముఖల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల కలయికలో రాజమౌళి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే వార్తలు వెలువడినప్పటి నుంచి.. ఈ మల్టీస్టారర్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

రామ్‌చరణ్‌కు విషెస్‌ చెప్పిన ఉపాసన
రామ్‌చరణ్‌కు ఆయన సతీమణి ఉపాసన ట్విటర్‌ ద్వారా బెస్ట్ విషెస్‌ తెలిపారు. ‘నా ప్రియమైన మిస్టర్‌ సీకి.. ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి రోజు షూటింగ్‌ ప్రారంభమైన సందర్భంగా శుభాకాంక్షలు’ అని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement