లొకేషన్‌ సెర్చ్‌ | rrr movie locations search by rajamouli and senthil kumar | Sakshi
Sakshi News home page

లొకేషన్‌ సెర్చ్‌

Aug 5 2018 3:23 AM | Updated on Jul 14 2019 1:57 PM

rrr movie locations search by rajamouli and senthil kumar - Sakshi

రామ్‌చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్‌

అక్కడికి, ఇక్కడికి ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్తున్నారట రాజమౌళి. ఏం బాగుండాలి అంటే ప్లేస్‌ విశాలంగా ఉండాలట. ఎందుకు? అంటే..‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ సెట్‌ కోసం. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌ను అనుకుంటున్నారు.

ఈ సినిమా కోసం భారీ సెట్‌ వేసేందుకు కెమెరామెన్‌ సెంథిల్‌ కుమార్‌తో కలిసి లొకేషన్స్‌ సెర్చ్‌ చేస్తున్నారు రాజమౌళి. రీసెంట్‌గా హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరు గ్రామ పరిసర ప్రాంతాలను టీమ్‌ పరిశీలించారని సమాచారం. ప్రస్తుతం బోయపాటి సినిమాతో రామ్‌చరణ్, త్రివిక్రమ్‌ సినిమాతో ఎన్టీఆర్‌ బిజీగా ఉన్నారు. అక్టోబర్‌లో ఎన్టీఆర్‌ సినిమా రిలీజ్‌ అవుతుంది. రామ్‌చరణ్‌ సినిమా కూడా అక్టోబర్‌ నాటికి ఓ కొలిక్కి వస్తుంది. సో.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నవంబర్‌లో మొదలయ్యే అవకాశాలు ఉంటాయని ఊహించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement