రాక్‌ స్టార్‌గా మారనున్న ‘రోగ్‌’! | Rougue Hero Ishaan Second Film Confirmed | Sakshi
Sakshi News home page

Aug 22 2018 4:04 PM | Updated on Mar 22 2019 1:53 PM

Rougue Hero Ishaan Second Film Confirmed - Sakshi

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన సినిమా రోగ్‌. ఈ సినిమాతో నిర్మాత సీఆర్‌ మనోహర్‌ వారసుడు ఇషాన్‌ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. పూరి మార్క్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమా ఇషాన్‌కు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో మరో సినిమా చేసేందుకు లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు ఇషాన్.

తాజాగా ఈ యంగ్‌ హీరో తన రెండో సినిమా పనులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. తొలి సినిమాతో రిస్క్‌ చేసిన ఇషాన్‌ రెండో సినిమాను మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నాడు. రెండో సినిమాతో రోగ్‌.. రాక్‌ స్టార్‌గా మారే ప్రయత్నాలు చేస్తున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. విజయదశమికి లాంచనంగా ప్రారంభం కానున్న ఈ సినిమాలో 12 పాటలు ఉంటాయట. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. అయితే ఈ సినిమాను కన్నడలోనే తెరకెక్కిస్తారా లేక ఒకేసారి తెలుగు, కన్నడలలో రూపొందిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement