నేను నటుణ్ణి కాదు | Roshagadu Pre Release Event | Sakshi
Sakshi News home page

నేను నటుణ్ణి కాదు

Nov 15 2018 1:37 AM | Updated on Nov 15 2018 8:08 AM

Roshagadu Pre Release Event - Sakshi

విజయ్‌ ఆంటోనీ, నివేథా పేతురాజ్‌ జంటగా గణేశ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రోషగాడు’. ఫాతిమా విజయ్‌ ఆంటోని సమర్పణలో పార్వతి మిట్టపల్లి నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్‌ ఎస్పీ టి.వి. హనుమంతరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ స్థాయిలో ఈ సినిమా కూడా విజయం సాధించాలి. పోస్టర్లో విజయ్‌ను చూస్తుంటే 20ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్లుంది’’ అన్నారు. ‘‘నా సినిమాల్లో నేను హీరో కాదు. కథే హీరో. నేను సౌండ్‌ ఇంజినీర్‌ని, సంగీత దర్శకుడిని. నటుణ్ణి కాదు.

అందుకే కథే హీరో అనిపించే చిత్రాల్లో నటిస్తుంటాను. గణేశ ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డారు’’ అన్నారు విజయ్‌ ఆంటోని. ‘‘తమిళంలో నేను దర్శకత్వం వహించిన ‘నంబియార్‌’ సినిమాకు సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని. ఇప్పుడు ఆయన హీరోగా సినిమా చేశాను. రచయిత విజయేంద్రప్రసాద్‌గారికి ఈ కథ చెప్పినప్పుడు విజయ్‌ ఆంటోని పేరునే సూచించారు’’ అన్నారు గణేశ. ‘‘ఒక శక్తిమంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్‌’’ అన్నారు రచయిత భాషా శ్రీ. గణపతి, సానం రామకృష్ణ, విజయ్, విశ్వనాథం, సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement