గాయంతోనే షూటింగ్ పూర్తి చేసిన విలన్ | Ronit Roy injured on Kaabil set | Sakshi
Sakshi News home page

గాయంతోనే షూటింగ్ పూర్తి చేసిన విలన్

May 19 2016 8:10 AM | Updated on Sep 4 2017 12:23 AM

గాయంతోనే షూటింగ్ పూర్తి చేసిన విలన్

గాయంతోనే షూటింగ్ పూర్తి చేసిన విలన్

హృతిక్ రోషన్ హీరోగా సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ యాక్షన్ మూవీ కాబిల్.

హృతిక్ రోషన్ హీరోగా సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ యాక్షన్ సినిమా కాబిల్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రముఖ టెలివిజన్ నటుడు రోనిత్ రాయ్ విలన్గా నటిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబందించిన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోనిత్ చేతికి తీవ్ర గాయమయ్యింది. తను గాయపడటం వల్ల షూటింగ్ ఆగిపోవద్దన్న ఆలోచనతో కేవలం ప్రాథమిక చికిత్స తీసుకొని వెంటనే తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు రోనిత్. ఈ విషయాన్ని దర్శకుడు సంజయ్ గుప్తా స్వయంగా తెలిపాడు.

ప్రమాదం జరిగిన తరువాత 24 గంటలు ఆలస్యంగా ఆపరేషన్ చేయించుకున్నాడు రోనిత్ రాయ్. ఈ ఆపరేషన్లో ప్రమాద సమయంలో రోనిత్ చేతిలోకి వెళ్లిన 9 గాజు ముక్కలను బయటకు తీశారు. ఆపరేషన్ తరువాత తన చేతిలోంచి తీసిన గాజుముక్కల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రోనిత్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement