రొమాంటిక్‌ జగన్నాథమ్‌ | Romantic Jagannatham | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ జగన్నాథమ్‌

May 8 2017 11:39 PM | Updated on Sep 5 2017 10:42 AM

రొమాంటిక్‌ జగన్నాథమ్‌

రొమాంటిక్‌ జగన్నాథమ్‌

ద్యావుడా... ఇదేం పని? స్కూటరేసుకుని మార్కెట్‌కి వెళ్లామా? కూరగాయలు తెచ్చుకుని, వంట చేశామా?

ద్యావుడా... ఇదేం పని? స్కూటరేసుకుని మార్కెట్‌కి వెళ్లామా? కూరగాయలు తెచ్చుకుని, వంట చేశామా? అన్నట్లు ఉండే జగన్నాథమ్‌ ఇలా సూటూ బూటూ వేసుకోవడం ఏంటి? వేర్‌ ఈజ్‌ ది పంచ్‌ కట్టు జగన్నాథా? అని ‘దువ్వాడ జగన్నాథమ్‌’లోని ఈ కొత్త స్టిల్‌ చూసి అనుకుంటున్నారా? మనోడు వంటోడే అయినా లోపల ఇంకా ఏదో ఉంది. ఆ యాంగిల్‌ ఏంటి? అనేది సినిమాలో చూస్తారు. ఆ పాత్ర తాలూకుదే ఈ స్టిల్‌.

పంచె కట్టులో పసందుగా కనిపించిన జగన్నాథమ్‌ సూటూ బూటులో సూపర్బ్‌గా ఉన్నాడు కదూ. ఈ లేటెస్ట్‌ స్టిల్‌ను సోమవారం విడుదల చేశారు. ఓ రొమాంటిక్‌ సాంగ్‌కి సంబంధించిన ఈ ఫొటోలో అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగుంది కదూ. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. సినిమాని జూన్‌ 23న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై  ‘దిల్‌’ రాజు– శిరీష్‌ నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement