‘రీమేక్‌ కాదు.. స్ట్రయిట్‌ సినిమానే’ | Rohit Shetty Dismisses Rumours Of Khakee Remake | Sakshi
Sakshi News home page

Feb 2 2019 10:15 AM | Updated on Feb 2 2019 12:12 PM

Rohit Shetty Dismisses Rumours Of Khakee Remake - Sakshi

కార్తీ హీరోగా తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖాకీ (తమిళ్‌లో ధీరన్ అధిగరం ఒండ్రు) సినిమాను బాలీవుడ్ లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు రోహిత్‌ శెట్టి ఈ రీమేక్‌ ప్లాన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ కూడా తీసుకున్నట్టుగా, నార్త్ నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

అంతేకాదు ఈ సినిమాకు సూర్యవంశీ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన దర్శక నిర్మాత రోహిత్‌ శెట్టి అవన్ని రూమర్స్ అంటూ కొట్టి పారేశారు. తాను అక్షయ్‌ కుమార్ హీరోగా చేయబోయే సూర్య వంశీ స్ట్రయిట్ సినిమా అని రీమేక్‌ కాదని క్లారిటీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement