ఆడపిల్లలను రక్షించండి

rk roja song release by aa nimisham movie - Sakshi

ప్రసాదరెడ్డి, రాణిశ్రీ, రేణుక, నాగబాబు, శ్రీదేవి, శరభారావు, వాసు ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆ నిమిషం’. కళా రాజేష్‌ దర్శకత్వంలో బండారు హరితేజ నిర్మించారు. ఈ సినిమాలోని ‘ఆడపిల్లలను రక్షించండి...’ లీడ్‌ సాంగ్‌ని నటి, ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా విడుదల చేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ– ‘‘మహిళలు విడాకులు తీసుకోకుండా వివాహ వ్యవస్థపై చైతన్యం వచ్చేలా, ప్రతి ఒక్కరూ ఆడపిల్లల్ని కనాలి.. వారే జాతికి నిజమైన సంపద.. వంటి మంచి పాయింట్లతో ‘ఆ నిమిషం’ చిత్రం తెరకెక్కింది.

హారర్‌ నేపథ్యంలో చక్కగా ఒక మంచి సందేశాత్మక చిత్రం నిర్మించినందుకు కళా రాజేష్, హరితేజకు అభినందనలు. ‘ఆడపిల్లలను రక్షించండి...’ అంటూ సాగే పాట ప్రతిఒక్కర్నీ ఆలోచింపచేసేలా, స్ఫూర్తిని రగిలించేలా ఉంది. ఇంత మంచి పాట రాసిన కళా రాజేష్, రవి మాదగోనిలకు, చక్కని సంగీతం అందించిన కున్ని గుడిపాటికి అభినందనలు’’ అన్నారు. ‘‘రాజకీయం, టీవీ రంగంలో నిత్యం బిజీగా ఉన్న రోజాగారు మా సినిమాలోని ప్రధాన పాటని విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఆమె అభినందనలు మా యూనిట్‌కి తొలి విజయం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top