తిరిగొస్తున్నా

Rishi Kapoor set to return to India post treatment - Sakshi

ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్‌. క్యాన్సర్‌ చికిత్స కోసమే వెళ్లారని సమాచారం. ఆ మధ్య దర్శకుడు రాహుల్‌ రవైల్‌ ‘రిషీ కపూర్‌ క్యాన్సర్‌ నుంచి పూర్తిగా నయం అయ్యారు’ అని పేర్కొన్నారు. తాజాగా రిషీ ఇండియా తిరిగి రావడానికి రెడీ అయ్యారని తెలిసింది. ‘ఆగస్ట్‌ నెలాఖరుకల్లా నేను ఇండియా రావొచ్చు. డాక్టర్‌  ఏమంటారో చూడాలి. కోలుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. తిరిగొచ్చేసరికల్లా 100శాతం ఫిట్‌గా ఉంటాను’ అని పేర్కొన్నారు రిషీ. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న కాలంలో ఆయన కుటుంబం, ఇండస్ట్రీ సభ్యులు ఎప్పటికప్పుడు ఆయన్ను న్యూయార్క్‌ వెళ్లి పలకరిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top