ఆ పేరుతో మీకేం నొప్పి: సీనియర్ నటుడు | Rishi Kapoor fire on who ctiticise Taimur Ali Khan name | Sakshi
Sakshi News home page

ఆ పేరుతో మీకేం నొప్పి: సీనియర్ నటుడు

Dec 22 2016 9:55 AM | Updated on Sep 4 2017 11:22 PM

ఆ పేరుతో మీకేం నొప్పి: సీనియర్ నటుడు

ఆ పేరుతో మీకేం నొప్పి: సీనియర్ నటుడు

బాలీవుడ్ జంట సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌ తమ పండంటి బిడ్డకు పెట్టిన పేరుపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముంబయి: బాలీవుడ్ జంట సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌ తమ పండంటి బిడ్డకు పెట్టిన పేరుపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కరీనాకపూర్ బాబాయి, సీనియర్ నటుడు రిషి కపూర్ సీరియస్ గా స్పందించారు. గత మంగళవారం కరీనాకపూర్ జన్మనిచ్చిన బాబుకు తైమూర్ అలీఖాన్ పటౌడీ అని పేరు పెడితే మీకేమయ్యింది అంటూ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తంచేశారు. విమర్శిస్తున్న వారిని టార్గెట్ చేసుకుని.. అసలు మీరేవరూ చెప్పడానికి, వారి పిల్లాడికి ఆ తల్లిదండ్రులు వారికి నచ్చిన పేరు పెట్టే అవకాశం ఉందని వరుస ట్వీట్లు చేశారు.

'మీకు పుట్టిన పిల్లలకు ఈ జంట పేరు పెట్టలేదుగా ఆసలు ఈ విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. చరిత్రలో మనకు తెలిసి అలెగ్జాండర్, సికందర్ అనే వ్యక్తులు ఆధ్యాత్మిక గురువులేం కాదు. అయినా ప్రపంచంలో ఎంతోమంది తమ పిల్లలకు ఆ పేర్లు పెడుతున్నారు. అదేవిధంగా సైఫీనా దంపతులు వారి బిడ్డకు తైమూర్ అని నామకరణం చేశారు. ఇలా చేస్తే మీకు ఏం నొప్పి వచ్చింది' అంటూ వరుస ట్వీట్లలో రిషికపూర్ తన ఆగ్రహాన్ని వెల్లగక్కారు. కాగా, 14 వ శతాబ్దంలో ఢిల్లీపైకి దండెత్తి వచ్చిన తైమూరు ఇక్కడ సర్వనాశనం చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఎంతో మంది ఈ పేరుతో ఉన్నారని.. అనవసర కామెంట్లు, విమర్శలు చేయకుండా ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదంటూ రిషికపూర్ మండిపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement