ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్‌ వైరల్‌ | RGVs Murder Telugu Movie: Another Poster Released | Sakshi
Sakshi News home page

ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్‌ రిలీజ్‌

Jun 26 2020 3:57 PM | Updated on Jun 26 2020 4:31 PM

RGVs Murder Telugu Movie: Another Poster Released - Sakshi

హైదరాబాద్‌: వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం ‘మర్డర్‌’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా చిత్రమ్‌ అనేది ఉపశీర్షిక. ఫాదర్స్‌ డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేస్తూ అమృత, మారుతీరావుల పాత్రలను పరిచయం చేశారు. తాజాగా మరో పోస్టర్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అమృత  తన కుమారుడిని ఎత్తుకుని ఉంది. అంతేకాకుండా అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితి పండించిన భావోద్వేగానికి ఫిదా అయ్యానని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. (యాంక‌ర్‌ని పొగిడిన ఆర్జీవీ..)

ఇక ఫాదర్స్‌ డే సందర్భంగా చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘ఓ తండ్రి తన కుమార్తెను ఎక్కువ ప్రేమతో పెంచడం వల్ల కలిగే ప్రమాదం. అమృత, మారుతీరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్‌ డే రోజున.. ఈ విషాద తండ్రి పోస్టర్‌ను విడుదల చేస్తున్నాను’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘మర్డర్‌ అనేది మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ’ ‘అతి ప్రేమే అతి ద్వేషానికి కారణమవుతుందని, తీవ్ర హింసకు దారి తీస్తుంది’ అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. (అమృతా ప్రణయ్‌ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్‌..)

Advertisement
 
Advertisement
Advertisement