వర్మకు కరోనా పాజిటివ్‌, ఆగిన ‘మర్డర్‌’!

RGV Tests Covid Positive His Lawyer Says To SC ST Special Court - Sakshi

సాక్షి, నల్గొండ: తనకు కరోనా సోకలేదని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ట్విటర్‌లో వీడియో షేర్‌ చేసిన రామ్‌గోపాల్‌ వర్మ కోర్టు వ్యవహారంతో అడ్డంగా దొరికిపోయారు. ఆయన రూపొందిస్తున్న‘మర్డర్‌ సినిమా’పై అమృతా ప్రణయ్‌ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. మర్డర్‌ సినిమాకు సంబంధించి అఫిడవిట్‌ దాఖలు చేయాలని నల్గొండలోని ఎస్సీ ఎస్టీ స్పెషల్‌ కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, రామ్‌గోపాల్‌ వర్మకు కరోనా సోకినందున...అఫిడవిట్‌పై సంతకం చేయలేకపోయారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ మరో రోజుకు వాయిదా వేయాలని విన్నవించారు. దీంతో ఆగస్టు 14కి కోర్టు విచారణ వాయిదా వేసింది. అయితే, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అమృత ఆరోపించారు. కరోనా సోకలేదని రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌‌లో ప్రకటించారని కోర్టుకు తెలిపారు. కోర్టు దృష్టికి వాస్తవాలు తీసుకెళ్తామని అమృత తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
(‘మర్డర్‌’ దర్శక నిర్మాతలు నల్గొండ కోర్టుకు..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top