
'జాము రాతిరి జాబిలమ్మా.. జోల పాడనా' సాంగ్ వినిపించగానే ఎవరికైన టక్కున గుర్తుకొచ్చేది అలనాటి హీరోయిన్ శ్రీదేవి. క్షణ క్షణం సినిమాలో ఈ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్ తరాలు మారినా ఆదరణ మాత్రం తగ్గలేదు. 1990లో విడుదలైన క్షణ క్షణం సినిమాను స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.

క్షణ క్షణం సినిమాలో జాము రాతిరి జాబిలమ్మా అంటూ.. వెండితెరపై వెంకటేశ్, శ్రీదేవి కనిపించిన విషయం తెలిసిందే. అయితే, వెంకటేశ్ స్థానంలో శ్రీదేవి పక్కన రామ్ గోపాల్ వర్మ ఉంటే.. అదేలా సాధ్యం అంటారా..? ఏఐ టెక్నాలజీ సాయంతో వర్మ అభిమానులు దీనిని క్రియేట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ సాంగ్‌ను రామ్ గోపాల్ వర్మ కూడా షేర్ చేశాడు. శ్రీదేవి పక్కన కనిపించే భాగ్యం తనకు కల్పించిన ఏఐ టెక్నాలజీకి ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పారు.
Thanks to AI , Me in Venkatesh pic.twitter.com/VhnhUv8ddM
— Ram Gopal Varma (@RGVzoomin) May 31, 2024
అతిలోక సుందరి శ్రీదేవి అంటే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు అమితమైన అభిమానంతో పాటు గౌరవం కూడా ఉంది. ఆ ఇష్టంతోనే క్షణ క్షణం, గోవిందా గోవిందా చిత్రాల్లో శ్రీదేవినే హీరోయిన్‌గా ఉండాలని ఎంపిక చేశారు.