కొత్త ఏడాది బ్యూటిఫుల్‌ | rgv beautiful release date announced | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది బ్యూటిఫుల్‌

Dec 21 2019 2:43 AM | Updated on Dec 21 2019 2:43 AM

rgv beautiful release date announced - Sakshi

నైనా

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందించిన చిత్రం ‘బ్యూటిఫుల్‌’. ‘ట్రిబ్యూట్‌ టు రంగీలా’ అన్నది ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కింది. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్‌ కుమార్, టి.శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ ప్రేమ కథాంశంతో వైవిధ్యభరితంగా రూపొందిన చిత్రమిది. సూరి, నైనాల అభినయం మనసులను హత్తుకుంటుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి శంకర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ,  రచన, కెమెరా, దర్శకత్వం: అగస్త్య మంజు.

Advertisement
 
Advertisement
Advertisement