రాంగోపాల్ వర్మకు నోటీసులు | Rgv, Amitabh Bachchan, Sarkar 3 in legal trouble | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మకు నోటీసులు

Oct 26 2016 2:49 PM | Updated on Sep 4 2017 6:23 PM

రాంగోపాల్ వర్మకు నోటీసులు

రాంగోపాల్ వర్మకు నోటీసులు

ఇండియన్ సినిమా రూపు రేఖలు మార్చిన గ్రేట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు. తన సినిమాలకు తను సృష్టించే వివాదాలతోనే పబ్లిసిటీ చేసుకునే వర్మ తాజా మరో వివాదానికి...

ఇండియన్ సినిమా రూపు రేఖలు మార్చిన గ్రేట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు. తన సినిమాలకు తను సృష్టించే వివాదాలతోనే పబ్లిసిటీ చేసుకునే వర్మ తాజా మరో వివాదానికి కారణమయ్యాడు. ప్రస్తుతం వర్మ.., అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో సర్కార్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే సర్కార్, సర్కార్ రాజ్ సినిమాలతో ఘనవిజయాలు సాధించిన ఆర్జీవీ ఈ మూడో భాగంతో మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. అయితే వర్మకు సర్కార్ సీక్వల్ చేసే హక్కు లేదంటూ ఓ వ్యక్తి నోటీసులు పంపించాడు. ముంబైకి చెందిన నరేంద్ర హిరావత్, సర్కార్ సీరీస్కు సంబందించిన సకల హక్కులు తనవని, ఆ సినిమాకు సీక్వల్, రీమేక్ లాంటివి చేయాలంటే తన అనుమతి అవసరమని తెలిపాడు.

రాంగోపాల్ వర్మ తనను సంప్రదించకుండానే సర్కార్ 3 షూటింగ్ మొదలుపెట్టాడని. వెంటనే వర్మ తనతో మాట్లకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసులలో తెలిపాడు. వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సర్కార్ హక్కులు మరొకరి దగ్గర ఎందుకు ఉన్నాయో..? ఈ వివాదం పై వర్మ ఎలా స్పందిస్తాడో..? తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement