సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ వచ్చేసిందోచ్ ! | Review of Sardaar Gabbar Singh from UAE | Sakshi
Sakshi News home page

సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ వచ్చేసిందోచ్ !

Apr 7 2016 6:42 PM | Updated on Mar 22 2019 5:33 PM

సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ వచ్చేసిందోచ్ ! - Sakshi

సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ వచ్చేసిందోచ్ !

తెలుగు ప్రేక్షకులు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఎలా ఉండబోతుందా అని ఎదురుచూస్తుండగా.. విదేశాల్లోని పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం అప్పుడే సంబరాల్లో మునిగిపోయారు. ఎందుకంటే అక్కడ అప్పుడే సర్దార్ విడుదలైంది.

యూఏఈ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. పవన్ కల్యాణ్ అభిమానులు రేపు పండగా చేసుకోబోతున్నారు. తెలుగు లోగిళ్లలో రేపు ఉగాది సందడితోపాటు పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పండుగ వాతావరణంతో దుమ్మురేపనుంది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని ఎదురుచూస్తుండగా.. విదేశాల్లోని ఆయన అభిమానులు మాత్రం అప్పుడే సంబరాల్లో మునిగిపోయారు.

ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైంది. దుబాయ్ తో పాటు పలు నగరాల్లో విడుదలైన ఈ చిత్రం చాలా పాజిటివ్ టాక్ను తెచ్చుకుంటోందట. ఇండియన్ సినిమా మేగజిన్ ఎడిటర్, బ్రిటన్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేర్ సందు చిత్ర విశేషాలు తెలుపుతూ పలు ట్వీట్లు చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ సినీ చరిత్రలో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుందంటూ ట్వీట్ చేశారు.

సినిమా పూర్తయ్యే వరకు ప్రేక్షకులతో ఈలలు కొట్టించే చిత్రం అన్నారు. సినిమా అంతా పవన్ వన్ మ్యాన్ షోలా నడిపించారని అన్నారు. కాజల్ అగర్వాల్ కూడా ఈ చిత్రంలో అత్యున్నత ఫర్ఫామెన్స్ చేసిందని, దేవీ శ్రీ సంగీతం అదుర్స్ అంటూ పవన్ ఫ్యాన్స్కు పండగే అని ట్వీట్ చేశారు. బాహుబలి ఓపెనింగ్ డే రోజు సాధించిన వసూళ్లను బ్రేక్ చేసే సత్తా సర్దార్ గబ్బర్ సింగ్కు ఉందంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి విదేశాల్లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంటున్న సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో తెలిపే పూర్తిస్థాయి రివ్యూ తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement