రెట్రో స్టెప్పులు | Retro style Venky Mama rocking | Sakshi
Sakshi News home page

రెట్రో స్టెప్పులు

Nov 16 2019 2:48 AM | Updated on Nov 16 2019 2:48 AM

Retro style Venky Mama rocking - Sakshi

వెంకటేష్, పాయల్‌ రాజ్‌పుత్

ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి ‘ఎన్నాళ్లకో..’ అంటూ స్టెప్పులేశారు వెంకటేష్‌. ఈ రెట్రో స్టెప్పులు ‘వెంకీమామ’ చిత్రం కోసమే. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కె.ఎస్‌. రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలు. వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాత.

‘వెంకీమామ’ టైటిల్‌ సాంగ్‌ను ఇటీవల విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘ఎన్నాళ్లకో..’ అనే మరో పాటను నేడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీమణి లిరిక్స్‌ అందించిన ఈ పాటని పృథ్వీచంద్ర పాడారు. వెంకటేష్, పాయల్‌ రాజ్‌పుత్‌లపై తెరకెక్కించిన పాట ఇది. ‘‘1980 నేపథ్యంలో సాగే రెట్రో సాంగ్‌ ఇది. తమన్‌ మంచి సంగీతం ఇచ్చారు. ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
∙వెంకటేశ్, పాయల్‌ రాజ్‌పుత్‌

Advertisement
 
Advertisement
Advertisement