నోట్ల బ్యాన్తో సినిమా వాయిదా..? | Release date of intlo deyyam nakem bayam is deferred | Sakshi
Sakshi News home page

నోట్ల బ్యాన్తో సినిమా వాయిదా..?

Nov 10 2016 10:38 AM | Updated on Sep 4 2017 7:44 PM

నోట్ల బ్యాన్తో సినిమా వాయిదా..?

నోట్ల బ్యాన్తో సినిమా వాయిదా..?

500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీరంగాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టగా...

500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీరంగాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టగా ఈ వారం రిలీజ్ కావాల్సిన సినిమాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం దగ్గర డబ్బులు లేకపోవటంతో ఎంత మంది థియేటర్ల వరకు వస్తారో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

దీంతో చేసేదేమి లేక తమ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు అల్లరి నరేష్. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ముందుగా ఈ శుక్రవారం రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఒక్క రోజు ఆలస్యంగా శనివారం విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వారం పాటు వాయిదా వేసి వచ్చే శుక్రవారం (నవంబర్ 18న) రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement