ఛాన్స్‌ కావాలంటే అడ్జస్ట్‌ కావాలన్నాడు! | Regina with English magazine | Sakshi
Sakshi News home page

ఛాన్స్‌ కావాలంటే అడ్జస్ట్‌ కావాలన్నాడు!

Feb 27 2017 1:00 AM | Updated on Sep 5 2017 4:41 AM

ఛాన్స్‌ కావాలంటే అడ్జస్ట్‌ కావాలన్నాడు!

ఛాన్స్‌ కావాలంటే అడ్జస్ట్‌ కావాలన్నాడు!

‘‘ఒక్క ఛాన్స్‌ కావాలా? అయితే ‘అడ్జస్ట్‌’ అవ్వాలి.. ఓకేనా?’’

‘‘ఒక్క ఛాన్స్‌ కావాలా? అయితే ‘అడ్జస్ట్‌’ అవ్వాలి.. ఓకేనా?’’ అని అడిగేవాళ్లు ఉంటారని సినిమా రంగం గురించి తెలిసినవాళ్లు అంటుంటారు. ఒకప్పుడు రెజీనాకి ఇలాంటి సంఘటనే ఎదురైంది.

ఆ విషయం గురించి ఓ ఆంగ్ల పత్రికతో రెజీనా మాట్లాడుతూ – ‘‘ఏడేళ్ల క్రితం నేనో తెలుగు సినిమా చేస్తున్నప్పుడు, ఎవరో వ్యక్తి ఒక తమిళ సినిమాకి అవకాశం ఇస్తానంటూ ఫోన్‌ చేశాడు. ఆ ఛాన్స్‌ కావాలంటే, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్‌ చేయాలన్నాడు. అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఫోన్‌ పెట్టాశాను’’ అన్నారు. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు తెలిసుండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement