సకుటుంబ సపరివార సమేతంగా...  | raviteja new movie started | Sakshi
Sakshi News home page

సకుటుంబ సపరివార సమేతంగా... 

Feb 20 2018 12:44 AM | Updated on Feb 20 2018 12:44 AM

raviteja new movie started - Sakshi

రవితేజ

రవితేజ ఏదైనా టూర్‌ వెళ్లారేమో అనుకుంటున్నారా? టూర్‌ వెళ్లేంత తీరిక లేదు. కానీ సుకుటుంబ సపరివార సమేతంగానే ఉన్నారు. ఇది సినిమా ఫ్యామిలీ. ఒక మూవీకి కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు చిత్రబృందమంతా ఒక కుటుంబంలాగానే కలిసిమెలిసి ఉంటారు కదా. ప్రస్తుతం రవితేజ అండ్‌ సినిమా ఫ్యామిలీ సందడి సందడిగా షూటింగ్‌ చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాల ఫేమ్‌ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది.

ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. ఫస్ట్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేసిన చిత్రబృందం రీసెంట్‌గా వైజాగ్‌లో వారం పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఫ్యామిలీ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు. రోజుకి మినిమమ్‌ 40 నుంచి 50 మంది ఆర్టిస్టులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement