క్షణం దర్శకుడితో రానా | Ravikanth to direct rana | Sakshi
Sakshi News home page

క్షణం దర్శకుడితో రానా

Nov 5 2016 12:03 PM | Updated on Aug 11 2019 12:52 PM

క్షణం దర్శకుడితో రానా - Sakshi

క్షణం దర్శకుడితో రానా

తొలి సినిమా క్షణంతోనే సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ రవికాంత్ పెరుపు. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా సంచలన విజయం సాధించటంతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించి పెట్టింది. దీంతో దర్శకుడు...

తొలి సినిమా క్షణంతోనే సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ రవికాంత్ పెరుపు. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా సంచలన విజయం సాధించటంతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించి పెట్టింది. దీంతో దర్శకుడు రవికాంత్ కు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే రెండో సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా తన సెకండ్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేశాడు.

క్షణం రిలీజ్ అయిన వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రెండో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడట. రానా, వెంకటేష్ల కాంబినేషన్లో రవికాంత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం రానా ఒక్కడితోనే రవికాంత్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే ప్రకటన రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement