కరోనా ఎఫెక్ట్‌: ‘క్రష్‌’ ఫోటోలు వైరల్‌ | RaviBabu Crush Telugu Movie New Poster Viral | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌: ‘క్రష్‌’ ఫోటోలు వైరల్‌

Mar 5 2020 4:25 PM | Updated on Mar 5 2020 4:45 PM

RaviBabu Crush Telugu Movie New Poster Viral - Sakshi

టాలీవుడ్‌లో ప్రయోగాత్మకమైన చిత్రాలను తెరకెక్కించడంలో నటుడు, దర్శకుడు రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రయోగాలను వదిలిపెట్టకుండా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘ఆవిరి’ చిత్రం తర్వాత రవిబాబు తాజాగా చేస్తున్న చిత్రం ‘క్రష్‌’. షూటింగ్‌ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర బృందం ప్రారంభించింది. దీనిలో భాగంగా చిత్రానికి సంబంధించిన మరో రెండు పోస్టర్లను మూవీ యూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ‘కరోనా వైరస్‌’వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్‌లు ధరించాలంటూ సూచిస్తూ వినూత్న ఫోటోలను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కరోనా వైరస్‌ను కూడా ఉపయోగించుకుని సినిమా ప్రమోషన్స్‌ చేసుకోవచ్చని రవిబాబుకు మాత్రమే తెలుసు’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇక న్యూఇయర్‌ కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌పై కూడా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.  తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement