అఅఆ... ఆగస్ట్‌లో అమెరికా | Ravi Teja's AAA moved to Hyderabad | Sakshi
Sakshi News home page

అఅఆ... ఆగస్ట్‌లో అమెరికా

Jul 24 2018 12:30 AM | Updated on Jul 24 2018 12:30 AM

Ravi Teja's AAA moved to Hyderabad - Sakshi

రవితేజ

మాస్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది... అమర్‌ ఇక్కడ.. ఊహూ.. అక్బర్‌ ఇక్కడ. కాదు.. కాదు.. ఆంటోని ఇక్కడ. ఇంతకీ ఈ ముగ్గురూ ముగ్గురా? లేక ఒకే వ్యక్తిలో ఉండే మూడు క్యారెక్టర్లా? రవితేజ ఇక్కడ. ఆన్సర్‌ సెప్టెంబర్‌లో చెబుతారట. ‘వెంకీ, దుబాయ్‌ శీను’ వంటి హిట్స్‌ ఇచ్చిన రవితేజ–శ్రీను వైట్ల మరో మమ్మాస్‌ మూవీ ఇచ్చే పనిలో ఉన్నారు. టైటిల్‌ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. దాదాపు పదేళ్ల  తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని  నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది.

నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఆమెరికాలో నెలరోజుల పాటు సాగనుందని సమాచారం. ఆగస్ట్‌ ఫస్ట్‌ వీక్‌ నుంచి సెప్టెంబర్‌ మొదటివారం వరకు చిత్రబృందం అక్కడే ఉండనున్నారు. ఆల్రెడీ మార్చిలో ఓ 40 రోజుల పాటు అమెరికా షెడ్యూల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి జరిపే అమెరికా షెడ్యూల్‌తో ఒక్క సాంగ్‌ షూటింగ్‌ మినహా  సినిమా ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అవుతుంది. సునీల్, శ్రీనివాస రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్‌ వంటి యాక్టర్స్‌తో రవితేజ చేసే హిలేరియస్‌ కామెడీని దర్శకుడు శ్రీనువైట్ల ఆడియన్స్‌కు అందించనున్నారని టాక్‌. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement