రీమేక్‌ను పక్కన పెట్టేసిన మాస్‌ మహరాజ్‌ | Ravi Teja calls off Bogan Remake | Sakshi
Sakshi News home page

రీమేక్‌ను పక్కన పెట్టేసిన మాస్‌ మహరాజ్‌

Nov 1 2017 3:46 PM | Updated on Nov 1 2017 3:46 PM

Ravi Teja calls off Bogan Remake

రెండేళ్ల విరామం తరువాత బ్లాక్‌ బస్టర్‌సక్సెస్‌ తో రీ ఎంట్రీ ఇచ్చాడు మాస్‌ మహరాజ్‌ రవితేజ. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్‌ సినిమాతో మరోసారి తన  స్టామినా ఏంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వరుస సినిమాలకురెడీ  అవుతున్నాడు రవితేజ. ఇప్పటికే టచ్‌ చేసి చూడు సెట్స్‌మీద ఉండగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సూపర్‌ హిట్‌ భోగన్‌ను రవితేజ హీరోగా తెలుగులో రీమేక్‌ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా రవితేజ ఈ రీమేక్‌ను తప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తమిళ్‌లో జయం రవి, అరవింద్‌ స్వామిలు ప్రధాన పాత్రల్లో తెరకకెక్కిన ఈ సినిమా కోలీవుడ్‌ లో భారీ వసూళ్లు సాదించింది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్‌లో జయం రవి పాత్రకు రవితేజను తీసుకున్నారు. కానీ అరవింద్‌ స్వామి పాత్రకు సరైన నటుడు కుదరకపోవటంతో రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడట. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ పై అధికారిక సమాచారం లేకపోయినా.. టచ్‌ చేసి చూడు సినిమా తరువాత రవితేజ శ్రీనువైట్ల సినిమా చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement