చిందేస్తే.. మస్తే మస్తే | Ravi teja Amar akbar anthony to travel USA for next schedule | Sakshi
Sakshi News home page

చిందేస్తే.. మస్తే మస్తే

Jun 30 2018 12:20 AM | Updated on Jun 30 2018 12:20 AM

Ravi teja Amar akbar anthony to travel USA for next schedule - Sakshi

రవితేజ

డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే.. అదిరిపోద్ది థియేటర్‌ రవితేజ వేస్తే స్టెప్పులే. మరి.. ఇలాంటి స్టెప్పులకు ఇలియానా కూడా కాలు కదిపితే సాంగ్‌ అదుర్స్‌ కదూ. ప్రజెంట్‌ ఇలాంటి దుమ్ము రేపే సాంగ్‌నే షూట్‌ చేస్తున్నారు. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై వై. రవిశంకర్, చెరుకూరి మోహన్, నవీన్‌ ఎర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇలియానా కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ప్రత్యేక సెట్‌లో రవితేజ, ఇలియానాలపై చిత్రీకరిస్తున్న పాట షూటింగ్‌ ఈ రోజుతో కంప్లీట్‌ అవుతుంది. ఫుల్‌ ఎనర్జీతో రవితేజ వేసిన ఈ స్టెప్పులకు ఫ్యాన్స్‌ మస్తే మస్తే అన్నమాట. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. పదేళ్ల తర్వాత రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇలియానా ఈ సినిమాతోనే సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. సునీల్, లయ, అభిమన్యు సింగ్, తరుణ్‌ అరోరా, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త.

Advertisement
 
Advertisement
Advertisement